గుర్ల: మండలం వ్యాప్తంగా క్లోరినేషన్ కార్యక్రమం

71చూసినవారు
గుర్ల: మండలం వ్యాప్తంగా క్లోరినేషన్ కార్యక్రమం
గుర్ల డయేరియా ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా క్లోరినేషన్, శానిటేషన్ కార్యక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గుర్ల మండల కేంద్రంలో అలాగే మండలంలో గల పలు పంచాయతీలో క్లోరినేషన్ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్