రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. గురువారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు నుండి కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వైసిపి నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, రైతులు నుండి పెద్ద యెత్తున ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామన్నారు.