బోడసింగిపేటలో కార్డెన్ సెర్చ్

81చూసినవారు
బోడసింగిపేటలో కార్డెన్ సెర్చ్
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బొండపల్లి మండలం బోడసింగిపేటలో గజపతినగరం సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం సాయంత్రం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గుర్తింపుపత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఎస్సైలు లక్ష్మణరావు మహేష్, లక్ష్మి ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్