ఎన్నికలలో వైసిపి అఖండ విజయం ఖాయం

589చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం ఖాయమని గజపతినగరం శాసనసభ్యులు, వైసిపి అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య అన్నారు. మంగళవారం గజపతినగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు అర్ధరాత్రి వరకు ఓటింగ్ లో పాల్గొన్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలు అన్నారు. వైసీపీ నేతలు తవుడు, వెంకటరావు, రామునాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్