కాలువ గట్టును ఢీకొన్న ప్రైవేట్ పాఠశాల బస్సు

84చూసినవారు
కాలువ గట్టును ఢీకొన్న ప్రైవేట్ పాఠశాల బస్సు
మన్యం జిల్లా, కొమరాడ మండలం డంగభద్ర వద్ద శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. జంఝావతి కాలువ గట్టును ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాగా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్