బాలికల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలని మన్యం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి. జగన్మోహనరావు స్పష్టం చేశారు. గరుగుబిల్లి డా. బిఆర్ అంబేద్కర్ గురుకులం(బాలికల) హాస్టల్ ను గురువారం సందర్శించారు. ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, హాస్టల్ సిబ్బందితో సమీక్షించి విద్యార్థుల ఆరోగ్య వివరాల రికార్డులు, సిక్ రిజిస్టర్లను పరిశీలించారు. హీమోగ్లోబిన్ పరీక్షల నివేదికలను తరగతుల వారీగా పరిశీలించారు.