ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై మాజీ డిప్యూటీ సీఎం పాములు పుష్ప శ్రీవాణి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం చిన్న మేరంగి ఆమె నివాసం నుండి మాట్లాడుతూ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను దిగదార్చే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకొని ప్రజల ముందుకు రావాలన్నారు.