కుక్కను చూస్తే పిల్లి ఆమడ దూరం పరిగెత్తుతుంది. కానీ గుమ్మలక్ష్మీపురం మండలం గుణదలో గురువారం కుక్క, పిల్లి స్నేహబంధం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తోొంది. ఆజన్మ శత్రువులైన కుక్క, పిల్లి ఎలాంటి వైరం లేకుండా స్నేహపూర్వకంగా ఒకేచోట కలిసి మెలిసి తిరుగుతుండడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. స్నేహానికి కులం, మతం చివరకు జాతి, భేదం కూడా ఉండదని మరొక్కసారి రుజువైందని స్థానికులు పేర్కొన్నారు.