కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని లక్కగూడలో సోమవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఈనెల 20 - 31 వరకు నిర్వహిస్తుందని, పశువైద్యులు రైతుల వద్దకే వచ్చి పశువులకు, మేకలకు వైద్యమందిస్తారని తెలిపారు.