జ్వరాలు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

82చూసినవారు
సీజనల్ జ్వరాలు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టీ. జగన్ మోహనరావు ఆదేశించారు. కొమరాడ మండలం అంటివలస గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేసి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేసారు. అనంతరం ఎంపీడీఓతో కలిసి గ్రామంలో పారిశుధ్య పనుల పరిస్థితులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్