దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి

67చూసినవారు
దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి
దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం కన్వీనర్ బత్తిని మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గరుగుబిల్లి మండలం శివం గ్రామంలో ఆదివారం బాధితుల ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఉద్దేశపూర్వకంగానే దళితుల భూములు కాజేయాలని వారిపై దాడులు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్