ఎంజెపి గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

85చూసినవారు
ఎంజెపి గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాలల కన్వీనర్ రమా మోహిని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 5 వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెల్లిమర్ల, గంట్యాడ, కొత్తవలస, సాలూరు, పార్వతీపురం బాలికల పాఠశాలల్లో 320 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్