వెయిట్ లిఫ్టింగ్ విజేత ఆదినారాయణకి సత్కారం
By raja 66చూసినవారుఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ లో జరిగిన ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నెల్లిమర్ల సెంచూరియన్ బిబిఎ విద్యార్థి బి. ఆదినారాయణ 81 కిలోల విభాగంలో రజత పతకం సాధించినందుకు ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు ఆయనను శాలువతో ఘనంగా సత్కరించారు. శనివారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించాలని కాంక్షించారు. అనంతరం రూ. 5వేలు నగదు బహుమతిని అందజేశారు.