శ్రీరామనవమి కల్యాణోత్సవానికి గోటి తలంబ్రాలు సిద్ధం

85చూసినవారు
శ్రీరామనవమి కల్యాణోత్సవానికి గోటి తలంబ్రాలు సిద్ధం
రామతీర్థంలో ఈనెల 17న నిర్వహించనున్న శ్రీరామనవమి కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. ఏటా శ్రీరామతీర్థం సేవాసంఘం ఈ తలంబ్రాలను సిద్ధం చేస్తోంది. బుధవారం నాటికి ఇవి సిద్ధమయ్యాయి. 2017 నుంచి శ్రీరామతీర్థం సంఘం ఆధ్వర్యంలో రామతీర్థం కల్యాణోత్సవానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శనం విజయ్ కుమార్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్