విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

2267చూసినవారు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
పూసపాటిరేగ మండలంలో శనివారం ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతిచెందినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మృతుడు అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాదికి చెందిన దారపు రెడ్డి అప్పారావు (48)గా గుర్తించారు. ఇతడు మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పనులు చేస్తుండంగా వైర్లు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. భోగాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

సంబంధిత పోస్ట్