ఈనెల 23న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు భోగాపురం మండల టిడిపి అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పోలిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. టిడిపి కంచుకోటగా ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకి కేటాయించడం దారుణమన్నారు. మండలంలో 22 పంచాయతీల మాజీ సర్పంచులు, ఎంపీటీసి సభ్యులు ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.