భామిని: తుఫాన్ ఎఫెక్ట్.. తేలికపాటి చినుకులు

65చూసినవారు
తుఫాన్ ప్రభావంతో భామిని మండలంలో వాతావరణం మబ్బులతో ఒక్కసారిగా మారడంతో శుక్రవారం సాయంత్రం తేలికపాటి చినుకులు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు ఎక్కడ నష్టం కలుగుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు కోసిన వరి చేనును కల్లాల్లో కుప్పలుగా వేసి, వర్షంకు తడవకుండా టార్పన్లు కప్పుతున్నారు.

సంబంధిత పోస్ట్