ఈనెల 25 వరకు డీఎస్సీ ఉచిత కోచింగ్ దరఖాస్తు పొడిగించినట్లు ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి సోమవారం సీతంపేటలో తెలిపారు. ఇంతవరకు దరఖాస్తులు చెయ్యని గిరిజన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తదితర సెంటర్లలో మూడు నెలల ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. జన్మభూమి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.