పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధిలో బడి దేవరమ్మ కొండ మైనింగ్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులు రద్దు చేయాలని కొండ పరిసర ప్రాంత గిరిజనులు, కొండ పరిరక్షణ కమిటీ నాయకులు గురువారం డిమాండ్ చేశారు. ఈమేరకు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం అడవి తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన ఐటీడీఏ, ఏపీవో మురళీ ధర్, ఏవో ప్రసాద్లకు వినతిపత్రం అందజేశారు.