స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మన్యం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున శనివారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మూడవ శనివారం నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి సాలూరులో శ్రీకారం చుట్టగా, కురుపాం ఎమ్మెల్యే గుమ్మలక్ష్మీపురంలోను, పార్వతీపురం ఎమ్మెల్యే, పాలకొండ ఎమ్మెల్యే పాల్గొన్నారు.