ఎపి టిడ్కో కాలనీల్లో వీలైనంత త్వరగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఆయన గురువారం టిడ్కో కాలనీలను పరిశీలించారు. ఇక్కడ దాదాపు 90 శాతం మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. సుమారు 411 ఇళ్లకు విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు.