మన్యం: 108 ఉద్యోగులకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు
గత 20 రోజులుగా 108 ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. పార్వతిపురం మన్యం జిల్లాలోని ఉద్యోగులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. 2024 నవంబర్ 26న వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో చర్చలు జరిపి 15 డిమాండ్లలో 14డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మినిట్స్ కాపీలు ఉద్యోగులకు బుధవారం అందజేశారు.