అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

76చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రాజాం చీపురుపల్లి రోడ్డులోని శ్రీలక్ష్మీ శ్రీనివాస పెట్రోల్ బంకులో పనిచేస్తున్న రామచంద్రరావు (54) అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందారు. ఆయన రాజాం మండలం విఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తి బంకులో హఠాత్తుగా మృతి చెందడంతో యాజమాన్యం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భార్య, ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాత మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్