శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు

71చూసినవారు
శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు
రాజాం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగాయి. శుక్రవారం వైశాఖ మాసం దశమి కావటంతో అమ్మవారిని దర్శించుకోవడానికి అత్యధికంగా మహిళా భక్తులు విచ్చేశారు. లలిత సహస్రనామ పారాయణ మరియు అష్టోత్తర శతనామ పారాయణతో ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసిన అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్