వంగర: పాఠశాల అభివృద్ధికి ఎస్ఎంసి కమిటీ కృషి చేయాలి

77చూసినవారు
వంగర: పాఠశాల అభివృద్ధికి ఎస్ఎంసి కమిటీ కృషి చేయాలి
పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ మరింతగా కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి వై దుర్గారావు సూచించారు. వంగర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్లకు మంగళవారం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వై దుర్గారావు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్య కమిటీ విధులు బాధ్యతలను సక్రమంగా అమలుచేయాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్