పాచిపెంట మండలం పంచాలి గ్రామంలో ఆదివారం స్వచ్ఛంద ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి డాక్టర్లు రవికాంత్, శ్రీభాల హాజరయ్యారు. సుమారు 90 మంది రోగులుకు వైద్య సేవలు చేసి ఔషధాలను పంపిణి చేశారు. ప్రజలకు ఆయర్వేద మందులు వలన ఉపయోగాలు, రోగాలు రాకుండా ఏమి చెయ్యాలి అనే దానిపై సూచనలు చేశారు.