మెంటాడ ఎగువ వీధిలోని కనకదుర్గమ్మ దేవాలయంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవి ఆశీస్సులు పొందుతున్నారు. తమ వాహనాలకు పూజలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు. దసరా సందర్భంగా మెంటాడ మండలంలోని దుర్గాదేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.