సాలూరు :అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ర్యాలీ, ధర్నా

66చూసినవారు
సాలూరు :అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ర్యాలీ, ధర్నా
తమ సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం సాలూరు మున్సిపల్‌ కార్మికులు గాంధీ నగరం నుంచి ర్యాలీ నిర్వహించారు. సాలూరు మున్సిపల్‌ కార్యాలయం గ్రీవెన్స్‌ వద్ద ధర్నా చేపట్టారు. పండగల పూట కార్మిక కుటుంబాలు పస్తువులతోనే ఉన్నాయని, డిసెంబర్‌ జీతం ఇంకా వేయలేదని, జనవరి జీతం ఎప్పుడు వస్తుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్