సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని వన్ ధన్ వికాస కేంద్రాలకు సంబంధించి పుస్తకాలు రాయడంపై ఆయా మండలాలు బుక్ కీపర్స్ కు శిక్షణ ఇచ్చారు. శనివారం సాలూరులోని వెలుగు కార్యాలయంలో జరిగిన ఈ శిక్షణలో ఏపీఎం అంపల్లి జయమ్మ , లీగల్ కోఆర్డినేటర్ కే. సత్యన్నారాయణలు క్యాష్ బుక్, కొనుగోలు రిజిస్టర్, అమ్మకం రిజిస్టర్ తదితర పుస్తకాలు వ్రాయడంపై శిక్షణ ఇచ్చారు.