వృద్ధులు, వితంతువులకు నెలకు 4 వేలు పెన్షన్

76చూసినవారు
వృద్ధులు, వితంతువులకు నెలకు 4 వేలు పెన్షన్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు వితంతువులకు నెలకు 4 వేలు, వికలాంగులకు 6 వేలు చొప్పున పెన్షన్ ఇస్తామని ఎస్ కోట ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గేదెల తిరుపతి హామీ ఇచ్చారు. ఎస్. కోట మండలం వినాయకపల్లిలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా సత్యారెడ్డిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్