జామి మండలంలో వరి విత్తనాలు పంపిణీ ప్రారంభం

52చూసినవారు
జామి మండలంలో వరి విత్తనాలు పంపిణీ ప్రారంభం
జామి మండలంలో రైతులకు ఆర్బికేల ద్వారా వరి విత్తనాలు పంపిణీ ప్రారంభించినట్లు ఏవో కిరణ్ కుమార్ సోమవారం తెలిపారు. ఎంటియు 1121, బిపిటి 3291, బిపిటి 5204, ఎం టి యు 13 18, ఎం టి యు 1224 రకం వరి విత్తనాలను మండలంలో గల ఆర్బికే కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ విత్తనాలను బ్యాచ్ ల వారీగా మొలక పరీక్షలు చేయడం జరిగిందన్నారు. రైతులు ఆధార్ కార్డుతో వచ్చి విత్తనాలు తీసుకెళ్లాలన్నారు.

సంబంధిత పోస్ట్