శ్రీ దార గంగమ్మతల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

54చూసినవారు
ఎస్ కోట ప్రజల గ్రామదేవత శ్రీ దార గంగమ్మ తల్లిని మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్ తదితర టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్