వేపాడ: మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ

63చూసినవారు
వేపాడ మండలం సోంపురం జడ్పీ హైస్కూల్ ను ఎమ్మెల్సీ రఘరాజు గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించేందుకు విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలించారు. ఉన్నత చదువులు చదువుకొని భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని కోరారు. రిపబ్లిక్ పేరెడ్ కు వెళ్లిన రాకేష్ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్