విద్యారంగంపై చర్చకు బాలకృష్ణ సిద్ధమా

58చూసినవారు
చీపురుపల్లిలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో సినీనటుడు బాలకృష్ణ తనపై చేసిన ఆరోపణలను మంత్రి బొత్స తిప్పికొట్టారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యారంగంపై బాలకృష్ణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, విద్యారంగ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ చేశారు. సెలిబ్రెటీలు కాబట్టి ఏది మాట్లాడితే అది చెల్లిపోతుందని అనుకుంటున్నారని, విద్య గురించి తెలియకపోతే తెలుసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్