ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి గజపతి రాజు నామినేషన్

580చూసినవారు
ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి గజపతి రాజు నామినేషన్
తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి (NDA) తరపున విజయనగరం శాసనసభ అభ్యర్థినిగా పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్తీక్ కు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు, జనసేన నాయకురాలు పాలవలస యశస్వి, బీజేపీ నాయకురాలు పావని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్