మాకవరపాలెం: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
మాకవరపాలెం మండలం శెట్టిపాలెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. మండలంలో చింతలూరు గ్రామానికి చెందిన మహిళలు కసింకోట మండలం భీమవరం వద్ద ఓ కంపెనీలో పనిచేయడానికి రోజు ఆటోపై రాకపోకలు సాగిస్తుంటారు. సాయంత్రం కంపెనీ నుంచి తిరిగి వీరిని స్వగ్రామానికి తీసుకువస్తున్న ఆటో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.