జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లాలో మంగళవారం నుంచి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు సోమవారం తెలిపారు. జిల్లాలో 19 ఏళ్లలోపు బాలబాలిలు 5,20,891 మంది ఉన్నారని, వారందరికీ మంగళవారం నుంచి వారం రోజులపాటు వీటిని పంపిణీ చేయనున్నామని పేర్కొన్నారు.