స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖలోని బొత్స క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని కేంద్రానికి చెబితే ప్రైవేటీకరణ ఆగుతుందని అన్నారు.