మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కును రోజురోజుకీ ధ్వంసం చేస్తోందని, కావాలని నష్టాల్లోకి నెట్టి ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ల శక్తుల చేతుల్లో పెట్టేందుకు కుట్రపన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం ఆరోపించారు. ఆదివారం పాత గాజువాక జంక్షన్లో మహాధర్నా నిర్వహించింది. లోకనాథం, అఖిల పక్ష నేతలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు బీజేపీ ముందు సాగిలపడడం సరికాదన్నారు.