ఈ నెల 24వ తేదీన విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. 46 అంశాలను ఎజెండాలో పొందుపరిచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిల్ సమావేశానికి సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై బుధవారం మేయర్ గొలగని హరి వెంకట్ కుమారి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.