ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల వృద్ధిని అరికట్టేందుకు విశాఖ జీవీఎంసీ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. ఈమేరకు నగరంలో తాగునీటికి పనికిరాని 64 నీటి నిల్వలను, చెరువులను గుర్తించింది. ఈమేరకు గత వారం రోజులుగా ఈ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ఎంఎల్ ఆయిల్‌ను స్ర్పే చేస్తోంది. దీంతో దోమల వృద్ధి ఆగిపోతుందని జీవీఎంసీ అధికారులు గురువారం తెలిపారు.