విశాఖ: పెట్రోల్ బంక్ భవనం కూల్చివేత
విశాఖలోని శాంతి ఆశ్రమం భూముల్లో అక్రమ కట్టడాల పై జీవీఎంసీకి జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆశ్రమ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్‌ను మంగళవారం కూల్చివేశారు. ఈ భూములు అన్నింటిని ఖాళీ చేసి శాంతి ఆశ్రమానికి అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా కాంక్రీట్ శ్లాబ్ వేయడంపై టౌన్ ప్లానింగ్ కన్నెర్ర చేసింది.