పులికొండ గ్రామంలో తాగునీటి ఎద్దడి

52చూసినవారు
పులికొండ గ్రామంలో తాగునీటి ఎద్దడి
ముంచంగిపుట్టు మండలంలోని పెద్దగూడ పంచాయతీ పరిధి పులికొండ గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు గురువారం డిమాండ్ చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక సమీప పంట పొలాల్లోని బురద నీటిని తెచ్చుకొని పలు రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకో లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్