భారీ వర్షానికి కూలిన రేకుల ఇల్లు

1079చూసినవారు
భారీ వర్షానికి కూలిన రేకుల ఇల్లు
జి మాడుగుల మండలంలోని సాడేకు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనితో కోట. పెద్దలక్ష్మయ్య అనే గిరిజనుడికు చెందిన రేకుల ఇల్లు కూలింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. వర్షం కారణంగా కుటుంబం ఆశ్రయాన్ని కోల్పోయిందని అధికారులే గుర్తించి బాధిత లక్ష్మయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక గిరిజనులు శనివారం తెలిపారు.