బుచ్చయ్యపేటలో మోడల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తా-ధర్మశ్రీ

62చూసినవారు
బుచ్చయ్యపేటలో మోడల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తా-ధర్మశ్రీ
బుచ్చయ్యపేట మండలం కేంద్రంలోని బుధవారం రాత్రి జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. కార్యకర్తలు అంతా సమిష్టిగా పనిచేసి మరోసారి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయినా వెంటనే సీఎం జగనన్న దృష్టికి తీసుకు వెళ్లి గ్రామంలో మోడల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రూ. 1 కోటి 50 లక్షల నిధులతో ఇప్పటకే ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్