రాజీనామా చేసిన మాడుగుల మార్కెట్ కమిటీ

79చూసినవారు
రాజీనామా చేసిన మాడుగుల మార్కెట్ కమిటీ
మాడుగుల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం స్వచ్చంద రాజీనామా చేసింది. తమ రాజీనామా పత్రాన్ని మార్కెట్ కమిటీ కార్యదర్శి బంగారురాజుకి అందజేశారు. ఎం కోటపాడుకి చెందిన సానాపతి కొండలరావు అధ్యక్షతన16 మంది సభ్యులతో మార్కెట్ కమిటీ అప్పటి మంత్రి ముత్యాల నాయుడు చొరవతో నియమించారు. అయితే తాజాగా ప్రభుత్వం మారడంతో కమిటీ స్వచ్ఛందంగా తమ రాజీనామా చేసింది. సందర్భంగా మాజీ మంత్రి ముత్యాలనాయుడుకు ధన్యవాదాలు తెలిపారు

సంబంధిత పోస్ట్