ఓటు హక్కు నమోదుకు ఏప్రిల్ 15 చివరి తేదీ

54చూసినవారు
ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ ఒకటి 2024 సంవత్సరం నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఏప్రిల్ 15 చివరి తేదీ అని నర్సీపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జయరాం తెలిపారు. అర్హులైన ఓటర్లు ఫారం 6 నింపి దగ్గరలో ఉన్న బిఎల్వోలకు గాని, తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఓటర్లుగా నమోదు అయిన వారు తమ ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్