నాతవరం మండలం డి. యర్రవరం గ్రామంలో సోమవారం పండుగ వైభవంగా జరిగింది. గ్రామంలో ప్రజలు అంతా ఊరేగింపుగా ఆలయం వద్దకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. బాణాసంచా, చిడతలతో మహిళలు ప్రదర్శన ఆకర్షనీయంగా నిలిచింది. మాఘమాసంలో ఈ పండుగ చేయడం సంప్రదాయంగా వస్తుంది. గ్రామ పెద్దలు , ప్రజలు సహకారంతో పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.