అనకాపల్లి: లెప్రసీ క్యాంపెయిన్ పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్

60చూసినవారు
అనకాపల్లి: లెప్రసీ క్యాంపెయిన్ పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్
లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ 2025 పోస్టర్ను అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయకృష్ణన్ సోమవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఈ నెల20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వతేదీ వరకు 14 రోజులపాటు జరుగనున్న ఈసర్వేలో సీహెచ్వోలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి కుటుంబ సభ్యుడిని పరీక్షించాలన్నారు. అనుమానిత కేసులను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి పంపించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్