నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి
అనకాపల్లి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ జాహ్నవి గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. కొన్ని శాఖల పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 20వ తేదీ నాటికి లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు పూర్తి చేయాలన్నారు.